దిశ దశ, దండకారణ్యం:
ఉత్తర భారతానికి చెందిన రాముడి ఆనవాళ్లు దండకారణ్యంలో నేటికీ సజీవంగా ఉన్నాయి. ఇంతకీ రాముడు దక్షిణ భారదేశంలోని ఆనాటి దండకారణ్య ప్రాంతానికి రావడానికి కారణం ఏంటీ? 14 ఏళ్ల పాటు వనవాసం చేసేందుకు సువిశాల భారతదేశంలోని ఇతర అటవీ ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉన్నా… ఇప్పుడు ఛోటా నాగపూర్ దక్కన్ పీఠ భూములుగా పిలవబడుతున్న దండకారణ్య అటవీ ప్రాంతంలో సంచరించడం వెనకున్న ఆంతర్యం ఏంటీ..? రామయణ చరిత్రలో దండకారణ్య అటవీ ప్రాంతానికి అత్యంత బలమైన అనుభందం ఉన్నట్టుగా ఇక్కడ లభ్యమైన ఆధారాలు తేటతెల్లం చేస్తున్నాయి.
పది రకాల అరణ్యాలు…
రామాయణ కాలంలో అఖండ భారతావనిని పది రకాల అరణ్యాలుగా పిలిచేవారు. వింధ్యారణ్యం, చంపకారణ్యం, బదరికారణ్యం, నైమిశారణ్యం, గుహారణ్యం, దేవదారుకారణ్యం, కదలికారణ్యం, దండకారణ్యాం, కేదారికారణ్యం, అమృతవనం అని పిలిచేవారని గత చరిత్ర చెబుతోంది. అయితే రాముడు వనవాసంలో భాగంగా దండకారణ్య అటవీ ప్రాంతానికి కూడా మహర్షి విశ్వామిత్రుడు తీసుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అయితే దండకారణ్య అటవీ ప్రాంతం విషకీటకాలు తీవ్రంగా ఉండేవని ఇటువైపు వెల్లేందుకు ఎవరూ సాహసించేవారు కారని చరిత్ర చెబుతోంది. దీంతో ఆనాడు మునులు విశ్వామిత్రుడి నిర్ణయాన్ని ఆక్షేపించడంతో ఆజానుభావుడైన శ్రీరాముడు దండకారణ్యంలోకి అడుగు పెట్టకపోతే యగాలు అయినా ఈ అటవీ ప్రాంతం ఇలాగే ఉండిపోతుందని మహర్షి విశ్వామిత్రుడు మునులకు చెప్పడంతో శ్రీరాముని దండకారణ్య అటవీ ప్రాంత ప్రయాణం ప్రారంభం అయింది. ఈ కారణంగానే దండకారణ్య అడవులు విస్తరించి ఉన్న ప్రాంతంలో నేటికీ శ్రీరామునికి సంబంధించిన ఆనవాళ్లు నేటికీ కనిపిస్తున్నాయి. ఇందులో కరీంనగర్ జిల్లా రామడుగు శ్రీరాముని అడుగు పడిందనే ఈ పేరు పెట్టారని స్థానికులు చెప్తుంటారు. అంతేకాకుడా పెద్దపల్లి జిల్లాలోని రామగిరి ఖిల్లా, రాముని గుండాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఇల్లందకుంట రామాలయమే అయినా, భద్రాచలం సమీపంలోని పర్ణశాల నుండి సీతమ్మను రావణుడు ఎత్తుకెళ్లాడమే అయినా ఇలాంటి చరిత్ర ఆధారాలన్ని కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో సాక్షాత్కరిస్తున్నాయి. చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో శ్రీరాముడు సంచరించిన ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలకు కూడా నిధులు వెచ్చించారు. ఆనాడు దండకారణ్య అటవీ ప్రాంతంగా వాసికెక్కిన నేటి తెలంగాణ, చత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీతో పాటు ప్రాంతాల్లో కూడా సీతా రామ లక్ష్మణులు సంచరించినట్టుగా ఇప్పటి వరకు లభ్యమైన ఆధారాలు చెప్తున్నాయి.