పార్టీ సేవకు పరిమితం అవుతారా… ఎన్నికల బరిలో నిలుస్తారా..?

వెలిచాల రాజేందర్ రావు ఎటువైపు మొగ్గు చూపుతారో…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ లోకసభ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగనున్నారు..? పార్టీ సేవకే పరిమితం అవుతారా లేక… ప్రత్యక్ష్య ఎన్నికల బరిలో పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారా..? అన్నదే పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో కీలక బాధ్యతలు వెలిచాల రాజేందర్ రావుకు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందన్నదే హాట్ టాపిక్ గా మారింది. అయితే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కానీ రాష్ట్ర పార్టీలో కీలక బాధ్యత కానీ ఇస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజేందర్ రావు ఏ పదవి వైపు మొగ్గు చూపుతారోనన్న అంశంపై క్లారిటీ లేకుండా పోయింది. తాజాగా వెలిచాల అత్యంత సన్నిహితుల నుండి సరికొత్త ప్రతిపాదన వచ్చినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. గ్రాడ్యూయేట్ కానిస్టెన్సీ ఎమ్మెల్సీ బరిలో నిలబడాలని పలువురు సూచించినట్టుగా సమాచారం. ఈ విషయంపై సమాలోచనలు కూడా జరిపిన వెలిచాల అధిష్టానం ఆదేశమే ఫైనల్ గా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీ ముఖ్య నేతలతో కూడా ఆయన చర్చించినట్టుగా విశ్వసనీయ సమాచారం. అయితే నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామన్న సంకేతాలు అధిష్టానం పెద్దలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. లోకసభ ఎన్నికల్లో ఓటమికి కారణాలు ఏమిటన్న విషయంపై ఏఐసీసీ నియమించిన కురియన్ కమిటీ ముందు రాజేందర్ రావు ఉంచిన నివేదిక కూడా వారిని ఆకట్టుకున్నట్టుగా సమాచారం. చివరి నిమిషంలో టికెట్ రావడం వల్ల ఏడు సెగ్మెంట్లలోని 45 మండలాలను కవర్ చేసే పరిస్థితి లేకుండా పోయిందని, ముందుగానే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవని వివరించినట్టు తెలిసింది. పార్టీ నాయకులు ద్రోహం చేశారని కానీ, ఇతరాత్ర నాయకుల వైఫల్యాలు ఉన్నాయని కానీ ఫిర్యాదు చేయకుండా అసలు లోపాలు ఏంటీ అన్న విషయంపై సమగ్రంగా రాజేందర్ రావు కురియన్ కమిటీకి వివరించడంతో వారు ఆయన పట్ల సానుకూల థృక్ఫథాన్ని వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చినట్టయితే మాత్రం ముందుగానే తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టయితే సత్ఫలితాలను రాబట్టగలుగుతానన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచినట్టుగా తెలిసింది. నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో గ్రాడ్యూయేట్స్ ఓటర్లను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మల్చుకునే విషయంలో ధీమా వ్యక్తం చేస్తున్న రాజేందర్ రావు, ఇటీవల నిరుద్యోగులు హైదరాబాద్ లో చేసిన ఆందోళన సమయంలో ప్రత్యక్ష్యంగా అక్కడకు వెల్లి వారికి సర్ది చెప్పిన తీరు కూడా అధిష్టానం వద్ద ప్లస్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో రాజేందర్ రావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ పార్టీ బాధ్యతలు అప్పగించినా పదవికి తగిన విధంగా న్యాయం చేస్తానని కూడా అదిష్టానం ముందు వెలిచాల వివరించినట్టుగా సమాచారం.

ఆ అపవాదుకు చెక్…

ఎన్నికల సమయంలో వచ్చి ఆ తరువాత కనిపించకుండా పోతారన్న ప్రచారాన్ని కూడా రాజేందర్ రావు చేతల్లోనే తిప్పి కొడుతున్నారు. అటు వ్యాపారాలను చూసుకుంటూ ఇటు స్థానిక రాజకీయాల్లో కనిపించేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కూడా ఆయన స్థానికంగా అందుబాటులో ఉంటున్న విషయం కూడా పార్టీ శ్రేణుల్లో మరింత సానుకూలతను పెంచిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page