పలు చోట్ల ఫెమా యాక్ట్ అమల్లో భాగంగా దాడులు
దిశ దశ, జాతీయం:
ఫెమా యాక్టులో భాగంగా పలు చోట్ల దాడులు జరిపిన ఈడీ అధికారులు పలు చోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఓ చోట వాషింగ్ మిషన్ లో దాచిన డబ్బును కూడా వెలికి తీశారు ఈడీ అధికారులు. ఇది కదా మనీ లాండరింగ్ అంటే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బట్టలు వాష్ కోసం ఇస్తే లాండ్రీకి ఇచ్చాం అంటుంటారు కదా… అయితే ఇదే పదానికి పోలీ ఉంటుంది మనీ లాండరింగ్ యాక్ట్ లాండ్రికి లాండరింగ్ కు దగ్గరి సంబంధం ఉండడం… వాషింగ్ మిషన్ లో బట్టలు వాష్ చేస్తాం కాబట్టి ఇది కదా మనీ లాండరింగ్ అంటే అని నెటిజన్లు డిఫరెంట్ గా కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే… ఈడీ అధికారులు ఫెమా యక్టు కింద కాప్రికోర్నియా షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో పాటు డైరక్టర్ విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామితో పాటు వారి సన్నిహితులకు చెందిన సంస్థల్లో ఈడీ అధికారులు దాడులు చేశారు. ముంబాయి, హైదరాబాద్, డిల్లీ, కురక్షేత్ర, కోల్ కత్తాలలో ఈ దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ. 2.54 కోట్ల నగదు. 47 బ్యాంకు అకౌంట్లను గుర్తించారు ఈడీ బృందాలు.