34 రోజుల ముందే రెక్కి… పచ్చునూరు గ్యాంగ్ వార్ వెనక..?

దిశ దశ, మానకొండూరు:

భూమి పంచాయితీ విషయంలో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య చాలా రోజులుగానే సాగుతున్నట్టుగా ఉంది. ఇరువురు హెచ్చరికలు చేసుకుంటున్న క్రమంలో రెక్కీ కూడా నిర్వహించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. మే 28న పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి మానేరు వాగులో శవమై తేలిన గోపు ప్రశాంత్ రెడ్డి హత్యకు ముందు జరిగిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు చేసిన దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నిందితులను రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసు విచారణ ఇంకా కొనసాగిస్తున్నారు. పరారైన నిందితుల కోసం ఓ వైపున గాలిస్తూనే… మరో వైపున కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలుసుకుంటున్నారు దర్యాప్తు అధికారులు.

34 రోజుల క్రితమే రెక్కి…

34 రోజుల క్రితమే రెక్కి నిర్వహించినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. గోపు ప్రశాంత్ రెడ్డి, నన్నేవేని రమేష్ అలియాస్ జానీ భాయ్ మధ్య భూమి పంచాయితీ విషయంలో హెచ్చరికలు చేసుకునే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో గోపు ప్రశాంత్ రెడ్డిని హతం చేయాలని జానీ భాయ్ నిర్ణయించుకున్న నన్నేవేని రమేష్ గాజు శంకర్, అంతడుపుల సాయి కృష్ణ అలియాస్ ఎస్కే, తాండ్ర మహేష్ అలియాస్ చిన్న మహేందర్, కురుకాల అనిల్, సర్దార్ కుల్దీప్ సింగ్ అలియాస్ కార్తీక్, మద్దెల వెంకటేష్, పొన్నాల మనోహర్, ఇరుకొండ మహేష్, కొమ్మాడవేని హరీష్ ల సహాయం కోరడంతో వారు అందుకు సమ్మతించారు. 34 రోజుల క్రితం కూడా ఓసారి రెక్కి నిర్వహించిన నిందితులు ఓ సారి ఫోన్ చేసి కూడా బెదిరించారు. రెండు మూడు రోజులగా పచ్చునూరు గ్రామంలో మరణాయుధాల వెంట పెట్టుకుని ప్రశాంత్ రెడ్డి కోసం ఆరా తీశారు. మే 27 అర్థరాత్రి ప్రశాంత్ రెడ్డి పచ్చునూరు గ్రామంలోని కసిరెడ్డి రాజేందర్ రెడ్డి, కొమ్మిడి శ్రీరామ్ రెడ్డిలతో కలిసి వారి ఇంట్లో ఉన్న సమాచారం అందుకుని రమేష్, శంకర్ లు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉన్న ప్రశాంత్ రెడ్డి తప్పించుకుని పారిపోగా రాజేందర్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డిలపై దాడి చేసి బెదిరించి వెళ్లిపోయారు. మే 28న మానకొండూరు మండలం ఊటూరులో గోపు ప్రశాంత్ రెడ్డి ఉన్నాడన్న సమాచారం అందుకున్న రమేష్ అలియాస్ జానీ భాయ్ గ్యాంగ్ అతన్ని వెంబడించి దాడి చేస్తున్న క్రమంలో తప్పించుకున్న ప్రశాంత్ రెడ్డి ఓ పాడుబడిన బావిలో పడిపోయాడు. అందులో ఉన్నప్పుడే వివిధ రకాలుగా దాడి చేసినప్పటికీ చనిపోకపోవడంతో తిరిగి బయటకు తీసుకొచ్చి అతన్ని PB-80-1103 జీపులో ఊటూరు, గర్రెపల్లి గ్రామాల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిలోకి తీసుకెళ్లారు. జీపులోంచి ప్రశాంత్ రెడ్డిని దింపి కత్తులతో అతని గొంతు కోసి చంపేసి అక్కడి నుండి పారిపోయారు.

తిరుపతికి చేరుకుని…

మోటారు సైకిళ్లు, జీపులో ఊటూరు, గర్రెపల్లి గ్రామాల నడుమ ఉన్న మానేరు నది నుండి నన్నేవేని రమేష్ తో పాటు మిగతా నిందితులంతా వివిధ వాహనాల్లో పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి స్టేజీ వద్దకు చేరుకుని అక్కడే అందరి మొబైల్స్ స్విఛ్ఛాప్ చేశారు. అక్కడి నుండి జానీ బాయికి సంబంధించిన రెడ్ కలర్ షిఫ్ట్ కారులో సికింద్రాబాద్ కు వెల్లి అక్కడే కొత్త షర్టులు కొనుగోలు చేశారు. రక్తపు మరకలు పడిన దుస్తులు, కత్తులు, కర్రలను అదే కారులో ఉంచి సికింద్రాబాద్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసి తిరుపతికి వెల్లి పోయారు. తిరిగి మే 30న హైదరాబాద్ లోని మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్లో షెల్టర్ తీసుకున్నారు.

You cannot copy content of this page