ఈడీ కౌంటర్ లో ఏం చెప్తుందో…?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీనంటూ ఈడీ ముందు వాంగ్మూలం ఇచ్చిన పిళ్లై యూ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నానని పిళ్లై రౌస్ అవెన్యౌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు ఈడీకీ నోటిసులు ఇచ్చింది. సోమవారం నాడు ఈడీ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా కోర్టు ఎలా స్పందిస్తునేదే చర్చ నీయాంశంగా మారింది. అయితే ఈడీ కెమెరా ముందే వాంగ్మూలం తీసుకోవడంతో పాటు లిఖిత పూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నప్పుడు కూడా పకడ్భందీగానే వ్యవహరిస్తుంటుంది. వీటన్నింటిని కూడా ఈడీ కోర్టు ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పిళ్లై పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనదే హాట్ టాపిక్ గా మారింది.
బలమైన కారణం ఉందా..?
ఇక్కడ పిళ్లై వాంగ్మూలం వాపస్ తీసుకునే విషయంలో వేసిన పిటిషన్ విషయంలో కోర్టు మరిన్ని విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుందని తెలుస్తోంది. ఆయన స్టేట్ మెంట్ రిటర్న్ తీసుకునే విషయంలో ఆయన చూపిస్తున్న బలమైన కారణాలేంటన్న విషయాన్ని కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. అయితే పిళ్లై తరుపు న్యాయవాది చూపించే కారణం కూడా వాంగ్మూలం వాపస్ తీసుకునేందుకు ఎంతో కీలకం కానుంది. అటు ఈడీ కౌంటర్ అఫిడవిట్, ఇటు పిళ్లై చూపించే కారణాలపైనే కోర్టు నిర్ణయం ఆదారపడి ఉన్నట్టు స్పష్టం అవుతోంది.
బర్త్ డే రోజునే…
యాధృచ్చికంగా పిళ్లై పిటిషన్ పై విచారణ కూడా లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత జన్మదిన రోజునే ఉండడం గమనార్హం. పిళ్లై పిటిషన్ రిటర్న్ తీసుకునేందుకు కోర్టు సమ్మతిస్తే తాను కవిత బినామీనే అన్న స్టేట్ మెంట్ లో మార్పు జరిగేందుకు అవకాశం ఉంటుంది. లేనట్టయితే పిళ్లై మొదట ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈడీ విచారణ కొనసాగించే అవకాశాలు ఉంటాయి. దీంతో కవిత బర్త్ డే రోజున ఎలాంటి వార్త వింటారోనన్న ఉత్కంఠ బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది.