అమ్మతనంలోని కమ్మదనం అంటే ఇదే…

టెట్ పరీక్ష కేంద్రాల్లో మానవత్వపు మమకారాలు

దిశ దశ, జగిత్యాల:

ఉద్యోగం కోసం తల్లడిల్లిపోతున్న ఓ తల్లి బాధ… ఆ తల్లి తపన ఏంటో మరో తల్లికి మాత్రమే తెలుస్తుంది. సరిగ్గా ఓ తల్లి డ్యూటీని పక్కనపెట్టి పసికందును అక్కున చేర్చుకున్నారు. జగిత్యాల జిల్లాలోని టెట్ పరీక్షా కేంద్రాల్లో పరిమళించిన మానవత్వపు పరిమళాల గురించి ప్రత్యక్ష్యంగా చూసిన ప్రతి ఒక్కరూ చలించి పోయారు. మాతృత్వపు మమకారాలను పంచేందుకు ముందుకు వచ్చిన తీరు చూసిన ప్రతి ఒక్కరూ అభినందించకుండా ఉండ లేకపోయారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని పసికందును అక్కున చేర్చుకున్న మహిళా పోలీసు అమ్మలా లాలించి పాలించిన తీరు ఆదర్శనీయంగా మారింది. ఎగ్జామినేషన్ సెంటర్ లో సాక్షాత్కరించిన మానవత్వపు విలువలను చూసిన ప్రతి ఒక్కరూ ఆ మహిళా కానిస్టేబుల్ ప్రేమను పంచుతున్న తీరును చూసి అభినందించకుండా ఉండ లేకుండా పోయారు.

You cannot copy content of this page