కొత్త సచివాలయం అప్పుడే ప్రారంభం

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణాలో ఏప్రిలో నెలలో బీఆర్ఎస్ ప్రభుత్వం వరస కార్యక్రమాలతో బిజీబిజీగా కాలం వెల్లదీయనుంది. ప్రభుత్వం నిర్దేశించుకున్నట్టుగా పనులను సకాలంలో పూర్తి చేసి వాటిని వినియోగంలోకి తెచ్చే పనిలో నిమగ్నం అయింది. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ అంతర్గత సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు విషయాలపై చర్చించారు. ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు అదే రోజు ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏప్రిలో 30న కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించడంతో పాటు అదే ప్రాంగణంలో సభ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న అమరవీరు స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే పార్టీ విషయానికి వస్తే ఏప్రిల్ 25న గ్రామ గ్రామన బీఆర్ఎస్ జెండాల ఆవిష్కరణ కార్యక్రమం, ఏప్రిల్ 27న ఎల్ బి స్టేడియలో ప్లీనరీ నిర్వహించనున్నారు.

You cannot copy content of this page