వలవేసి పట్టుకుంటున్నారక్కడ…

వలలు వాడుతున్నామంటే సాధారణంగా జలశయాల్లో చేపల వేట కోసం అనుకుంటాం. కానీ అక్కడ వలపన్ని మరీ పట్టుకుంటున్నవేంటో తెలిస్తే మీరు షాక్ అవాల్సిందే. ఇటీవల జనాలను భయాందోళనలకు గురి చేస్తున్న వాటిని ప్రాణాలతో పట్టుకోకపోతే జీవకారుణ్య సమితులో, పెటాలాంటి సంస్థలో రంగంలోకి దిగి కేసులు నమోదు చేయాలంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ఆలోచించిన ఆ మునిసిపాలిటీ యంత్రాంగం కాస్తా డిఫరెంట్ స్టైల్లో ఆ ప్రాణులను పట్టుకోవడం ప్రారంభించింది. హైదరాబాద్ సమీపంలోని అమీన్ పూర్ మునిసిపాలిటీ సారికొత్త చర్యలకు దిగింది. ఇటీవల కాలంలో చిన్నారులపై దాడులు చేస్తున్న శునకాలను కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కుక్కలను ఎలా కట్టడి చేయాలోనని సమాలోచనలు జరిపిన అధికారులు వల వేసి పట్టుకునే పనికి పరమాయించారు. అమీన్ పూర్ మునిసిపాలిటీలో కుక్కలు కనిపిస్తే చాలు ఓ వాహనం ఆ ప్రాంతానికి చేరుకుంటున్న టీమ్ వలపన్ని శునకాలను పట్టుకుని ఓ వాహనంలోకి ఎక్కిస్తున్నారు. వీటన్నింటిని సంగారెడ్డి సమీపంలోని కంది ఏబీసీ సెంటర్ కు తరలిస్తున్నారు. ఇంతకాలం కుక్కల బెడద తప్పించుకోవాలంటే పాయిజన్ ఫుడ్ ఇవ్వడం అవి చనిపోయాక తీసుకెళ్లే విధానం ఉండేది. అయితే పెటా లాంటి సంస్థలు జీవాలను చంపడం సరికాదంటూ చట్టాలకు పని చెప్పి కోర్టులను ఆశ్రయిస్తుండడంతో అధికారులు వల పన్ని పట్టుకునేలో నిమగ్నం కావాలని సిబ్బందికి ఆదేశాలిస్తున్నారు.

You cannot copy content of this page