మహిళా బిల్లు ఎఫెక్ట్
దిశ దశ, హైదరాబాద్:
మహిళా బిల్లు అమలు కాగానే ఒక్క అసెంబ్లీ స్థానాలే కాదు లోక సభ స్థానాల కిజర్వేషన్లలోనూ మార్పులు చేర్పులు తప్పవు. అత్యధిక మహిళా ఓటర్లు ఉన్న లోక సభ స్థానాల్లో రిజర్వేషన్ అమలు కానుంది. అయితే రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న వాటిని గుర్తించి వాటిలో టాప్ స్థానాల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేసే అవకాశాలు ఉంటాయి. ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తరువాత ఎప్పటి ఓటర్ల జాబితాను ప్రాతిపాదికన తీసుకుంటారు, కొత్తగా మళ్లీ గణన మొదలు పెడ్తారా లేక ఇప్పుడున్న జాబితాల ఆధారంగానే చేస్తారా అన్న విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు అయితే నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, జహీరాబాద్ స్థానాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నిజామబాద్ నుండి మరో సారి బరిలో నిలిచే అవకాశం ఉన్న కల్వకుంట్ల కవితకు రిజర్వేషన్ విధానం కూడా కలిసి రానుంది.