సోషల్ మీడియా వాడకం పెరిగే కొద్దీ ఏది నిజమో ? ఏది అబద్దమో కూడా తెలీడం లేదు. ఎందుకంటే కొత్త వార్తలు పుట్టలు పుట్టలుగా పుట్టుకొస్తున్నాయి. తాజాగా కరెన్సీ పై కూడా పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసి చాలా ఏళ్లు అవుతుంది. అప్పటి నుంచి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మన కరెన్సీపై చాల పుకార్లు వచ్చాయి . ఒకవేళ మీ వద్ద రూ. 500 నోటు ఉంటె ఈ తేడాని ఖచ్చితంగా తీసుకోవాలి. మార్కెట్‌లో 2 రకాల 500 నోట్లు వచ్చాయి. అవి ఏంటి ? ఆ రెండింటికి తేడా ఏమిటన్నది ఇక్కడ చూద్దాం.
ప్రస్తుతం మార్కెట్‌లో 2 రకాల 500 రూపాయల నోట్లు వాడుకలో ఉన్నాయి . ఈ రెండింటిలో తేడా ఏమిటంటే ఉంది. ఈ రెండింట్లోనూ ఒకటి ఫేక్ అని మనలో చాలా మందికి తెలీదు. సోషల్ మీడియాలో ఈ నోట్లు చక్కర కొడుతున్నాయి. రెండింట్లో ఏది నిజమైనదో ? ఏది కాదో? తెలుసుకుందాం..
మార్కెట్‌లో ఉండే 500 రూపాయల నోటులో పచ్చని పట్టీ RBI గవర్నర్ సైన్ ఉండే ప్లేసులో గాందీ బొమ్మ క్లోజ్‌గా ఉంటుంది. ఇలాంటి నోటు నకిలీ అని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారమౌతోంది. PIB ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఏది నిజమో చెక్ చేసింది. అసలు నోటు ఏదని తేల్చి చెప్పేసింది. PIB ఫ్యాక్ట్ చెక్ చేసిన తరవాత సోషల్ మీడియాలో ప్రచారమౌతున్న పోస్టులన్నీ అబద్ధమని అని నిర్ధారణైంది. మార్కెట్‌లో మనకి కనిపించే రెండు నోట్లు నిజమే అని తేలింది. ప్రస్తుతం ఉన్న రెండు రకాల 500 నోటు చెల్లుబాటు అవుతాయని RBI వెల్లడించింది.