మహా మాయగాళ్లందరూ… అతని ముందు బేజారు…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

ఆయన టార్గెట్ ఫిక్స్ చేశాడంటే అందరూ ట్రాప్ లో పడాల్సిందే. గురి చేసి విసిరితే కోట్ల డబ్బు అతని వలకు చిక్కాల్సిందే. నిర్దేశించుకున్న లక్ష్యం చేరేందుకు వేసే స్కెచ్ మాత్రం అషామాషీగా ఉండదు. ఒక్కో ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని వసూళ్లకు పాల్పడడం ఆ తరువాత తప్పించుకోవడం పరిపాటిగా మారిపోయిందా క్రిమనల్ కు. గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసినా తన నైజం మాత్రం మార్చుకోలేదా ప్రభుద్దుడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ కు చెందిన రమేషాచారి ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ వైట్ కాలర్ ఛీటర్ గురించి వింటే మీరూ ఔరా అనక మానరు.

ఈజీ మనీ కోసం…

తెలంగాణ బ్రాండ్ పేరిట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ తక్కవ ధరకే వివిధ రకాల వస్తువలు ఇస్తానంటూ ప్రచారం చేశాడు. తనకిక చావే శరణ్యమని ఆదుకోకపోతే నా పరిస్థితి ఇక అంతేనంటూ ముందుగా ఓ పోస్ట్ షేరి చేసి తన ట్రాప్ లో పడేసుకున్న ఈ ఘనడు ఒక్కొక్కరిని తన గ్రిప్ లోకి తెచ్చుకుని డబ్బుల వసూళ్లకు పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల, కరీంనరగ్, హైదరాబాద్ తో పాటు నలు ప్రాంతాల్లో వసూళ్లకు పాల్పడిన ఈ ఘనడు రూ. 50 కోట్ల వరకూ వసూలు చేసి ఉంటాడని ఓ అంచనా. ఈ ఘరానా మోసగాడి బాధితులంతా ఒకే వేదికపైకి చేరి బాధితుల పేరిట వాట్సప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకుని అతని కోసం వేట మొదలు పెట్టారు. ఎలక్ట్రానికి వస్తువులు తక్కువ ధరకు ఇవ్వడమే కాదు మీ ఇంటికే వచ్చి వాలుతాయి డోర్ డెలివరి నా ప్రత్యేకత అంటూ అబద్దాలతో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడంతో వ్యాపారులు గుడ్డిగా నమ్మి లక్షలకు లక్షలు నిందిుతనికి అప్పగించారు. అంతా అయ్యాక తామంతా మోసపోయామని లబోదిబోమని తలలు పట్టుకుంటున్నారు బాధితులు. సిరిసిల్ల పోలీసులకు అతనిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు అతన్ని వేటాడి వెంటాడి మరీ పట్టుకున్నారు. నిందితుని నుండి పూర్తి వివరాలు రాబట్టేందుకు, నగదు రికవరి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సిరిసిల్ల పోలీసులు.

గతంలో ఉద్యోగాల పేరిట…

సుమారు నాల్గైదు సంవత్సరాల క్రితం కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పలువురుకి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మరీ మోసం చేశాడీ ఘనుడు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర సలహాదారున్ని అంటూ ప్రచారం చేసుకుని గెజిటెడ్ ఉద్యోగాలకయితే రూ. 8 లక్షలు, వేరే ఉద్యోగాలకయితే మరో రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడ్డాడు. కాంట్రాక్టు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తానంటూ నమ్మించి మరీ మోసం చేసిన చరిత్ర ఆయన సొంతం. అయితే ఉద్యోగాల పేరిట మోసం చేసినా కూడా నిజాయితీగా వ్యవహరిస్తానని నమ్మించడంలో ధిట్ల అని అప్పుడు పోలీసుల విచారణ తేలింది. కొంతమందికి ఫలానా ఉద్యోగాల ఇప్పిస్తానని డబ్బులు తీసుకుంటున్నాని, 5 ఏళ్లలో ఉద్యోగాలు ఇప్పించకపోతే రూ. 2 వడ్డీతో డబ్బు చెల్లిస్తానంటూ నాన్ జ్యుడిషయల్ స్టాంప్ పేపర్లు కూడా రాసి ఇచ్చాడు. అప్పుడు పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్న తరువాత కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర సలహాదారున్ని అంటు పరిచయం చేసుకోగా అప్పటి సీపీ కమలాసన్ రెడ్డి అతని చరిత్ర మొత్తం తెలుసుకుని వెంటనే అరెస్ట్ చేశారు. అయితే బెయిల్ పై వచ్చిన రమేషాచారి ఇప్పుడు మళ్లీ తన విశ్వరూపం ప్రదర్శించి వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేశాడు.

You cannot copy content of this page