బీజేపీ ఎపిసోడ్ కు బాధ్యులెవరూ..?

మీడియాపైనే విమర్శలు…

లీకు వీరులెవరో..?

దిశ దశ, హైదరాబాద్:

నాల్గైదు రోజులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మార్పులు తప్పవన్న రీతిలో ప్రచారం జరిగింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ని తొలగిస్తారని ఆయనపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారని నేడో రేపో ఆయన్ని పదవి నుండి తీసేస్తారని కూడా బాహాటంగానే చర్చించుకున్న పరిస్థితి. పైగా ఇతర పార్టీల నాయకులు బండి సంజయ్ వ్యవహార శైలి కారణంగానే బీజేపీలోకి రావడం లేదని కూడా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ ఢిల్లీకి వెల్లడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా హస్తినకు చేరడంతో ఏదో జరుగబోతోందన్న ఊహాగానాలు షికార్లు చేశాయి. కానీ చివరకు అదంతా వట్టిదేనని సంజయ్ ని మార్చేందుకు ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకోలేదని తేలింది. బండి, ఈటల ఢిల్లీకి వెల్లడానికి కారణం వ్యక్తిగతమేనని కూడా స్పష్టం అయింది.

బలైందెవరూ..?

తెలంగాణ బీజేపీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపేశాయనే చెప్పొచ్చు. అనూహ్యంగా జాతీయ నాయకత్వం ఎంట్రీ ఇచ్చిందన్న విషయంపై జరిగిన తర్జనభర్జనలు కూడా అంతాఇంతాకాదు. రాష్ట్ర బీజేపీలో జరిగిన ఈ చర్చల నేపథ్యంలో బండి సంజయ్ మార్పు తథ్యమని కథనాలు రాసేశాయి. ఫిరాయింపులను ప్రోత్సహించే విషయంలో సంజయ్ దూకుడుగా వ్యవహరించడం లేదని, రాష్ట్రంలో పార్టీ విస్తరించడం లేదని కూడా ప్రచారం చేసేశారు. దీంతో సంజయ్ స్థానంలో మరోకరిని నియమించడమే మిగిలిందన్న రీతిలో సాగినప్పటికీ అదంతా ఫాల్స్ పబ్లిసిటేనని స్పష్టమైంది. అయితే ఈ విషయంలో ఈటల రాజేందర్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతించాల్సిన అవసరం ఏర్పడింది. అదంతా మీడియా క్రియేట్ చేసిందే తప్ప మరోటి కాదని, తాను ఢిల్లీకి వెల్లడానికి కారణం ఓ వివాహానికి హాజరయ్యేందుకు తప్ప పార్టీ పెద్దలను మాత్రం కలవలేదన్నారు. చివరకు మీడియానే ఇదంతా క్రియేట్ చేసిందన్న స్థాయికి వచ్చింది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని మార్పు వ్యవహారం.

లీక్ వీరులెవరో..?

అయితే బీజేపీ అంతర్గత వ్యవహారాల గురించి మీడియా ప్రతినిధుల వరకు చేర్చిందెవరు..? బీజేపీలో ముసలం పెట్టించాలని మీడియా ప్రతినిధులు కావాలనే వర్గ విబేధాలను సృష్టించారా..? అభిప్రాయబేధాలు లేకున్నా ఉన్నట్టుగా చిలువలు పలువలు చేసి కథనాలు రాశారా..? తరుచూ ఎదో విషయంపై బీజేపీ వర్గ విబేధాల గురించి బయటకు చెప్తున్నదెవరన్నదే అంతుచిక్కకుండా పోయింది. అందరు శాఖాహారులే కానీ కోళ్లు మాత్రం మాయం అయ్యాయి అన్నట్టుగా ఉన్నాయి బీజేపీ నేతల స్పందన తీరు. బీజేపీలో వర్గవిబేధాలు ఉన్నాయన్న మాట అటుంచితే ఏకంగా రాష్ట్ర అధ్యక్షున్ని మార్చుతారన్న ఊహాగానాలకు ఆస్కారం కల్పించెదవరు..? ఫిర్యాదు చేసే యోయనలో మీడియాను పావుగా వాడుకున్నదెవరూ..? ఢిల్లీ పెద్దలు సంజయ్ పై ఆగ్రహంతో ఊగిపోతున్నారని చెప్పిందెవరూ..? ఇవన్ని కూడా మీడియా ప్రతినిధులే సొంతగా ఊహించి రాసేశారా..? నిజాన్ని కప్పిపుచ్చేందుకు నెపం మీడియాపై నెట్టేస్తున్నారా అన్నదే తేలాల్సి ఉంది.

You cannot copy content of this page