అక్కడే ఎందుకు తిరుగుతున్నాయ్..?

అటు ఇటు కీకారణ్యాలు ఉన్నా మధ్యన ఉన్న అడవుల్లో మాత్రమే ఎందుకు తిరుగుతున్నాయ్..? అక్కడి నుండే ఎందుకు తిరుగు ముఖం పడుతున్నాయ్..? మధ్య అటవీ ప్రాంతంలో సంచరిస్తూ గందరగోళంలో ఎందుకు పడుతున్నాయన్నదే అంతుచిక్కకుంగా పోయింది. ఒకే చోట పులుల సంచారం వెనక ఉన్న మతలబేంటి..?

కారణాలివేనా..?

ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలలను ఆనుకుని మహారాష్ట్రంలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలు విస్తరించి ఉంటాయి. ఈ రెండు జిల్లాలు కూడా దట్టమైన కీకారణ్యాలతో ఉన్నవే కాగా, సరిహధ్దును ఉన్న తెలంగాణ ప్రాంతం కూడా అడవులు గుట్టలు విస్తరించిన ప్రాంతమే. అయితే మహారాష్ట్ర సరిహద్దుల్లోని తాడోబా టైగర్ జోన్ కాగా, తిప్పేశ్వర్ అటవీ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పులుల అవాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటాయి. మరో వైపున ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని కవ్వాల్ ఏరియాను ఇక్కడి అటవీ అధికారులు టైగర్ జోన్ గా గుర్తించారు. తెలంగాణాలోని కవ్వాల్ నుండి తిప్పేశ్వర్ వరకూ ఉన్న ప్రాంతమంతా కూడా అనుసంధానమై ఉంటుంది. చాలా కాలాంగా ఈ ప్రాంతంలోని వన్య ప్రాణులు పొరుగు రాష్ట్రానికి వెల్లడం, అక్కడి వన్య ప్రాణులు తెలంగాణ సరిహద్దు అడవుల్లోకి ఎంట్రీ ఇవ్వడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే అయితే శీతాకాలంలో మాత్రం పులులు నాలుగు నెలల పాటు సాంగత్యం కొసం తిరుగుతూ ఉంటాయి. ఇందులో మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోని మగ పులులు ఇక్కడి ఆడపులుల కోసం తిరుగుతూ ఉంటాయని భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సారి కూడా ఈ ప్రాంతానికి కొన్ని పులులు వచ్చి చేరాయని అంచనా వేస్తున్నారు. అయితే అవి కవ్వాల్ అటవీ ప్రాంతం వరకూ వెల్లే పరిస్థితి లేకుండా తయారు కావడం వల్లే పులులు ఆసిఫాబాద్ జిల్లాలో తచ్చాడుతున్నాయన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా కాగజ్ నగర్ అటవీ ప్రాంతం నుండి కవ్వాల్ అభయారణ్యాలకు వెల్లేందుకు వీటికి ఓపెన్ కాస్ట్ బావులు అడ్డంకిగా మారాయని భావిస్తున్నారు. రైల్వే ట్రాక్, హైవేలపై రాకపోకలు తీవ్రంగా పెరగడం కూడా ఓ కారణమని అంచనా వేస్తున్నారు. ఓపెన్ కాస్ట్ ల కారణంగా అవి తమ గమ్యాన్ని చేరుకోలేకపోవడం వల్లే అవి ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంతోనే సరిపెట్టుకోవల్సి వస్తోందని అంటున్నవారూ లేకపోలేదు.

ఇంతకీ పులులెన్నో

ఆసిఫాబాద్ జిల్లా వాంకిడీ నుండి కాగజ్ నగర్ ఏరియా వరకూ తిరుగుతున్న పులులు ఎనిమిది వరకూ వచ్చి ఉంటాయని ప్రాథమికంగా నిర్దారణ చేసినట్టుగా తెలుస్తోంది. పెద్ద పులుల కాకుండా ఈ సారి పిల్ల పులులు వచ్చినట్టుగా గుర్తించినట్టు సమాచారం. అయితే అటవీ అధికారులు మాత్రం ఇప్పటి వరకూ ఈ ప్రాంతంలో ఎన్ని పులులు సంచరిస్తున్నాయన్న విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో సేకరించిన పులి అడుగు గుర్తులకు సంబందించిన వివరాలు సేకరించి వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ లకు పంపిస్తున్నారు కానీ అక్కడి నుండి వచ్చిన రిపోర్ట్ ల వివరాలు వెల్లడించడం లేదు. దీంతో పూర్తి స్థాయిలో క్లారిటీ రానప్పటికీ ప్రత్యక్ష్యంగా తిరుగుతున్న పులుల అడుగుల తీరు, వాటి ఇతరాత్ర కదిలకలతో ఓ అంచనా వేసి 8 వరకు ఆసిఫాబాద్ జిల్లాలో తిరుగుతున్నాయని భావిస్తున్నారు.

You cannot copy content of this page