దమ్ముంటే ఒకే చోట పోటీ చెయ్…

ఈటలకు గంగుల సవాల్

దిశ దశ, కరీంనగర్:

బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. దమ్ముంటే ఒకే చోట పోటీ చేయాలని రెండు చోట్ల చేయాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తానన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఆయనకు దమ్ముంటే గజ్వేలో మాత్రమే పోటీ చేయాలని హుజురాబాద్ లో కూడా బరిలో నిలుస్తానంటే భయపడ్డారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ బీఫారాలు ఢిల్లీలో ఒకే చోట సిద్దమవుతాయని, ఈ రెండు పార్టీలు కలిసే ఉంటాయని గంగుల కమలాకర్ ఆరోపించారు. బీజేపీకి తెలంగాణలో గుండు సున్నా వస్తుందని, ఆ భయంతోనే ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేస్తానని అంటున్నారన్నారు. మతతత్వ పార్టీలకు, భూ కబ్జాలకు పాల్పడే పార్టీలకు అధికారం ఇవ్వొద్దని కోరారు. ఆంధ్రానేతలపై మరో సారి మంత్రి గంగుల కమలాకర్ విరుచుకపడ్డారు. వైఎస్ షర్మిల, కెఏ పాల్, కేవీపీ రామచందర్ రావు, కిరణ్ కుమార్ రెడ్డిలకు తెలంగాణాలో ఏం పని అంటూ ప్రశ్నించారు. వారిని అసలే నమ్మెద్దని బీజేపీ ముసుగులో వచ్చి తెలంగాణాను తిరిగి ఆంధ్రాలో కలిపలాని చేస్తున్నారన్నారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలను పట్టించుకోమని తేల్చి చెప్పారు.

You cannot copy content of this page