అక్కడ చెట్ల నరికివేత ఎందుకో..?

దిశ-దశ మానకొండూర్ నియోజకవర్గం:

ఓ వైపున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాకు హరిత హారం కార్యక్రమం నిర్వహిస్తూ పచ్చదనాన్ని విస్తరింపజేసే కార్యక్రమం కొనసాగిస్తుంటే అక్కడ మాత్రం పచ్చని చెట్లు నేల వాలిపోతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం పకడ్భందీగా వ్యవహరించాల్సినా పట్టించుకుంటున్న పాపన పోవడం లేదక్కడ. దీనిని గమనించి స్థానికులంతా ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్.ఎం.డి కాలనీలో భారీ సైజులో ఉన్న చెట్లను నరికేసే కార్యక్రమానికి ఎందుకు శ్రీకారం చుడుతున్నారన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఎల్ఎండీ కాలనీలో మహాత్మనగర్ ఎస్సారెస్పీ క్వార్టర్స్ ఆవరణలోని భారీ సైజు చెట్లను నరికి వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. త్వరలో నిర్వహించనున్న ఓ కార్యక్రమం కోసమే ఇక్కడి చెట్లను నరికించి భూమిని చదును చేసే పనిలో నిమగ్నం అయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. హరిత తెలంగాణా కావలని ముఖ్యమంత్రి పిలునిస్తే చెట్లను నరికించి మైదాన ప్రాంతాలుగా తయారు చేయడం వెనక ఆంతర్యం ఏంటన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

పశులపై అలా…

హరిత తెలంగాణలో భాగంగా మీడియన్లలో కానీ రోడ్ల పక్కన కానీ నాటిన మొక్కలు తిన్నందుకు మేకలపై, గొర్రెలపై ఫైన్లు వేసిన సంఘటనలూ ఉన్నాయి. అంతేకాకుండా కరీంనగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాటిన మొక్కను పీకేశాడన్న గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇంత కఠినంగా చట్టాలను అమలు చేసిన చరిత్ర ఉన్న కరీంనగర్ జిల్లాలో దర్జాగా చెట్ల నరికివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ శాఖ అధికారితో మాట్లాడితే తమకేమీ సంబంధం లేదని చెప్తున్నప్పటికీ అక్కడ చెట్ల నరికివేత తంతుకు ఎందుకు బ్రేకులు వేయలేకపోతున్నరన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికారులు అనుమతి ఇచ్చే చెట్లను నరికించినట్టయితే నిభందనలకు విరుద్దంగా ఎలా వ్యవహరిస్తున్నారని అడుగుతున్నారు స్థానికులు. ఏది ఏమైనా ఎల్ఎండీలో పచ్చని చెట్ల నరికివేతపై మాత్రం స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

You cannot copy content of this page