ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో గురించి తెలియనివారుండరు. ఎన్నో ఏళ్లుగా ఈ కామెడీ షో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జబర్దస్త్ షోకు క్రేజ్ అలాగే ఉంది. పాత కమెడియన్లు పోయినా.. కొత్త కమెడియన్లు వస్తూ జబర్దస్త్ షో ద్వారా పేరు తెచ్చుకుంటున్నారు. జబర్దస్త్ షో ద్వారా టెలివిజన్ స్క్రీన్‌పై పేరు తెచ్చుకుని సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకుంటున్నారు.
అయితే జబర్దస్త్ షో నుంచి ఎంతోమంది బయటకు వచ్చిన విషయం తెలిసిందే. జడ్జిగా వ్యవహరించిన వారితో పాటు కమెడియన్లు, యాంకర్లు అందరూ బయటకొచ్చారు. ప్రస్తుతం జబర్దస్త్ షోలో కొత్త యాంకర్లు, కమెడియన్లు కనిపిస్తున్నారు. యాంకర్ రష్మితో పాటు అనసూయ జబర్దస్త్ షో నుంచి బయటకొచ్చింది. వాళ్లు జబర్దస్త్ నుంచి బయటకు రావడం వెనుక అనేక కారణాలు వినిపించాయి.
ఈ క్రమంలో తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి గత కారణాలను అనసూయ వెల్లడించింది. తన కొడుకులను చూసుకోవడానికి టైమ్ దొరకడం లేదని, జబర్దస్త్ తో పాటు సినిమాలు చేయడం వల్ల వారిని చూసుకోవడానికి సమయం ఉండటం లేదని చెప్పుకొచ్చింది. అందుకే జబర్దస్త్ మానేశానంది. బిజీ లైఫ్ వల్ల పిల్లలకు టైమ్ ఇవ్వలేకపోతున్నానని, వారితో గడపలేకపోతున్నానని అనసూయ చెప్పింది. కుటుంబానికి టైమ్ కేటాయించేందుకు జబర్దస్త్ మానేసినట్లు చెప్పుకొచ్చింది.
అయితే షోలో బాడీ షేమింగ్ చేస్తుండటం వల్ల జబర్దస్త్ మానేసినట్లు గతంలో అనసూయ తెలిపింది. కానీ ఇప్పుడు పిల్లల కోససే జబర్దస్త్ మానేశానంటూ ఈ బ్యూటీ చెప్పడం బుల్లితెర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ప్రస్తుతం అనసూయ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె ప్రధాన పాత్రలతో అనేక సినిమాలు వస్తుండగా..ఇతర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తోంది. బుల్లితెర మీద ఓ ఊపు ఊపేసిన అనసూయ.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా మంచి పేరు తెచ్చుకుంటోంది.అలాగే బుల్లితెరపై కూడా అప్పుడు అనసూయ గెస్ట్ గా కనిపిస్తోంది. పలు షోలకు ముఖ్య అతిధిగా అనసూయ వెళుతూ అలరిస్తోంది.