కథ లేకపోతే సినిమాలు చేయడం ఎందుకు.. పెద్ద సినిమాలపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్

‘సైన్మా’ అనే షార్ట్ ఫిల్మ్‌తో యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించి.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పాపులార్టీ దక్కించుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. తర్వాత ‘గీతా గోవిందం’ ‘జాతిరత్నాలు’ వంటి చిత్రాలలో కామెడీతో ఆద్యంతం మొప్పించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు రాహుల్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాహుల్.. తాజాగా ‘ఇంటింటి రామాయణం’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు కూడా సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్ర బృందం. ఈ క్రమంలో రాహుల్.. పెద్ద సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

పెద్ద సినిమాలు, కమర్షియల్ సినిమాలు చేయడం లేదు అని ప్రశ్నించగా.. రాహుల్‌ రామకృష్ణ తన దైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘‘అసలు కథ లేకపోతే సినిమా చేయడం ఎందుకు. నాకు డబ్బు మీదా ఆశ లేదు. మంచి సినిమాలు చేయాలనుకుంటున్న. మనకు నచ్చిన సినిమాలు చేస్తేనే ఇంటికెళ్లాక మనఃశాంతిగా తిని పడుకోవాలనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనకు ప్రాంతీయ భావన లేదని.. కథ నచ్చితే ఏదైనా చేస్తానని చెప్పాడు. ఈ సినిమాలో కథ, పాత్రలు, సన్నివేశాలు, సురేష్‌ నెరేషన్‌ నచ్చి చేశానని తెలియజేశారు. ఇందులో తెలంగాణలోని చాలా ప్రాంతాలున్నాయని.. ఎప్పటినుంచో మరుగున పడిన తెలంగాణ కల్చర్‌‌ను అద్భుతంగా చూపించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ప్రాంతాలకు, భేదాలకు భిన్నంగా ఉన్న సిసలైన కల్మషం లేని సినిమా ‘ఇంటింటి రామాయణం’ అని చెప్పారు. మన మనస్తత్వాలను, మనోభావాలను అలవోకగా, సులభంగా చూపించే సినిమా ఇది. అంతే కాకుండా ‘జాతిరత్నాలు’ కంటే డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాలో ఉంటుందని చెప్పుకొచ్చారు.

You cannot copy content of this page