చెరువులోకి దిగిన భార్య బాధితుడు… రక్షించిన పోలీసులు

దిశ దశ, హైదరాబాద్:

భర్తలు హింసిస్తే పోలీస్ స్టేషన్ లో భార్యలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. భర్త వేధింపులపై ఫిర్యాదు అఅందుకున్న వెంటనే భర్తను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ లో ఉండడంతో ఏంచేయాలో తెలియక భర్త ఆత్మహత్య చేసుకుంటానంటూ చెరువులోకి దిగాడు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… హైదరాబాద్ శివార్లలోని జయభేరి పార్కు చెరువులోకి దిగిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించాడు. నగేష్ అనే వ్యక్తి చెరువులోకి దిగి ఆందోళన చేస్తున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి స్థానికుల సాయంతో అతన్ని బయటకు తీశారు. అయితే తనను భార్య హింసిస్తోందని నగేష్ చెప్తుండడం స్థానికులను షాక్ కు గురిచేసింది. తనను కొడుతుందోని, కాలుస్తోందని ఆరోపిస్తున్న నగేష్ పిల్లలను తన దగ్గరికి రానివ్వడం లేదని డాడీ చనిపోయాడని చెప్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తానేం చేయాలో అర్థం కావడం లేదని చావాల అంటూ ప్రశ్నించాడు. తన భార్యతో విడాకులు ఇప్పించాలని నగేష్ కోరుతున్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.


You cannot copy content of this page