బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన పిటిషన్ ను త్వరగా విచారించాలని కోరుతూ చేసుకున్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారం 24న విచారణకు రానున్న నేపథ్యంలో అప్పుడే విచారిస్తామని స్పష్టం చేసింది. దీంతో కవిత ఈడీ చర్యలను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ పై సుప్రీం నిర్ణయం తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సింది. మరో వైపు ఈ నెల 20న ఈడీ విచారణకు రావాలని మళ్లీ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కవిత వెల్తారా లేదా అన్న సస్పెన్స్ మాత్రం వీడడం లేదు. ఆమె ఈడీ కార్యాలయంలోకి వెల్లే వరకూ ఉత్కంఠత నెలకొనక తప్పేలా లేదు. ఎందుకంటూ 16 నాటి విచారణకు వెల్తానన్న సంకేతాలను పంపిన ఎమ్మెల్సీ కవిత చివరి క్షణంలో తాను హాజరు కావడం లేదంటూ ఈడీ ఆఫీసుకు మెయిల్ చేశారు. ఈ నేఫథ్యంలో 20 నాటి విచారణకు ఆమె ఎలా స్పందిస్తారోనన్న సస్పెన్స్ నెలకొనే ఉంది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post