సమాచారా హక్కు చట్టం కమిషనర్ల నియామకం ఏమైంది..?

కోర్టులు ఆదేశించిన చొరవ తీసుకోవడం లేదెందుకు

దిశ దశ, హైదరాబాద్:

సమాచార హక్కు చట్టంలో భాగంగా దరఖాస్తు దారులు అడిగి వివరాలను ఇవ్వని విభాగాలపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన సమాచార  కమిషనర్ల నియామక ప్రక్రియపై సర్కారు దృష్టి సారించడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం కమిషనర్లను నియమించేందుకు చొరవ తీసుకోవడం లేదు. ఆర్టీఐ కార్యకర్త అంజలి భదర్వాజ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై స్పందించిన సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ లు ఇచ్చిన తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలో రెండేళ్లుగా సమాచార హక్కు కమిషనర్ల నియామక ప్రక్రియ లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్పిళ్లు చేసుకున్న దరఖాస్తులన్ని పెండింగులో ఉన్నాయని అంజలి కోర్టుకు నివేందించారు. ఝర్ఖండ్, త్రిపుర, తెలంగాణ రాష్ట్రాలలో ఆర్టీఐ నిర్వీర్వంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషనర్ వాదనలను ఏకీభవించిన కోర్టు తెలంగాణ ప్రభుత్వం నాలుగు వారాల్లో కమిషనర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆధేశించారు. గత జూన్ నెలలో కమిషనర్ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం నియామకాలు మాత్రం చేయలేదు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ తరుపున దాఖలైన హైకోర్టు కూడా కమిషనర్లను వెంటనే నియమించాలని ఆదేశించిన తరువాతే నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం నియమకాలు మాత్రం చేయలేదు.

వేలల్లో…

సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామక ప్రక్రియ పెండింగ్ లో ఉండడంతో తమ దరఖాస్తు పరిశీలనకు ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో ఆర్టీఐ ద్వారా అడిగిన సమాచారం ఇవ్వడం లేదని అప్పీల్ చేసుకున్న వారంతా కూడా తమ దరఖాస్తు విచారణకు వచ్చే అవకాశం లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కమిషనర్ల నియామకం చేసినట్టయతే పెండిగ్ లో ఉన్న దరఖాస్తులన్ని కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన కమిషనర్ల నియామకం విషయాన్నే పెండింగ్ లో ఉంచడంతో రాష్ట్రంలో ఆర్టీఐ యాక్టు అమలుపై నిర్లక్ష్య ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి కమిషనర్లు లేరన్న ధీమాతో కొన్ని శాఖల నుండి అయితే అసంబద్దమైన సమాధానాలు వస్తున్నాయని కూడా ఆర్టీఐ కార్యకర్తలు అంటున్నారు. మొక్కబడి సమాధానాలు ఇస్తూ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని, ఇలాంటి దరఖాస్తులపై విచారణ జరిపి దరఖాస్తు దారుల వాదనలు వినిపించేందుకు ఏర్పాటు చేసిన కమిషనర్లనే నియమించకపోతే ఎలా అన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది. కమిషనర్ కార్యాలయానికి పంపిన దరఖాస్తులను రికార్డు చేసుకుని నెంబర్ ఇస్తున్నారే తప్ప విచారించే అవకాశమే లేకుండా పోయిందని ఆర్టీఐ కార్యకర్తలు అంటున్నారు. కరోనా సమయంలో విచారణ పెండింగ్ లో పడడంతో అప్పుడు కూడా దరఖాస్తుల పరిశీలనలో తీవ్రమైన ఆలస్యం జరిగింది. ఇప్పుడు కమిషనర్ల నియామకం జరగకపోవడంతో మళ్లీ ఆలస్యంగా విచారణ చేపట్టాల్సిన పరిస్థితి తయారైందని వారంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కమిషనర్ల నియామక ప్రక్రియను పూర్తి చేసినట్టయితే ఆర్టీఐ చట్టం అమలుకు బలాన్ని ఇచ్చినట్టు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page