సినీ హీరోలకు ఆలయాల్లో ప్రోటోకాల్ ఉంటుందా..?

సాంప్రాదాయబద్దంగా స్వాగతం చెప్పవచ్చా..?

దిశ దశ, జగిత్యాల:

దేవాదాయ ధర్మదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో సినిమా హీరోలకు ప్రత్యేక మర్యాదాలు చేయాల్సిన అవసరం ఉంటుందా..? వీవీఐపి, వీఐపీలను సాదరంగా ఆహ్వానించినట్టే సినీ హిరోలను ఆలయాల్లోకి ఆహ్వానించాలన్న నిబంధనలు ఉన్నాయా..? దేవాదాయ శాఖ అధికారులు వారిపై ప్రత్యేక మర్యాదలు చేయడం వెనక ఆంతర్యం ఏంటన్నదే మిస్టరీగా మారింది. తాజాగా కేరళలోని శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయాన్ని సీని నటుడు దిలీప్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఆయనకు వీఐపీ దర్శనం కల్పించడాన్ని అక్కడి హై కోర్టు తప్పు పట్టింది. వేలాది మంది భక్తులను క్యూ లెన్లలో నిల్చోబెట్టి నటుడికి వీఐపీ దర్శనం కల్పించడం ఏంటని ప్రశ్నించడం విశేషం.

ఇక్కడ మాములే…

అయితే తెలంగాణలోని దేవాలయాల్లో సీనీ నటులకు ప్రత్యేకంగా రాచ మర్యాదలు కల్పిస్తున్నారన్న ఆరోఫణలు లేకపోలేదు. సీనీ గ్లామర్ ముందు దేవాదాయ శాఖ కూడా దాసోహం అన్నట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అత్యంత ప్రాశస్త్యం ఉన్న దేవాలయాలకు సినీ నటులు వచ్చినప్పుడు త్వరితగతిన దర్శనాలు చేయించి పంపిస్తుంటారు. భక్తులు కూడా వారిని చూసేందుకు ఆసక్తి కనబర్చినట్టయితే నెట్టుకునే అవకాశం ఉంటుందని భావించి వీలైనంత త్వరగా సినీ నటులను ఆలయాల్లో దర్శనం చేయించి పంపించే ఆనవాయితీ కొనసాగుతోంది. వాస్తవంగా అయితే ప్రోటోకాల్ ప్రకారం అయితే వీరికి ప్రత్యేకంగా దర్శనాలు చేయించే విధానం కూడా సరికాదని తెలుస్తోంది. అయితే కొన్ని దేవాలయాల్లో అయితే సినీ నటులను రాజగోపురం వద్ద నుండి ప్రత్యేకంగా ఆహ్వానం పలికే సంస్కృతికి శ్రీకారం చుట్టడం విస్మయం కల్గిస్తోంది. ఇటీవల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి సినీ నటలు వచ్చినప్పుడు దేవాదాయ శాఖ అధికారులు వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశం అయింది. హీరో శ్రీకాంత్, వరుణ్ తేజ్ లు కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆలయ అధికారులు వారిని ప్రత్యేకంగా ఆలయ సంప్రాదాయం ప్రకారం తీసుకెళ్లడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ హోదా కల్గిన కొండగట్టు ఆలయాన్ని దర్శించుకునే వారి విషయంలో ప్రత్యేకంగా ప్రోటోకాల్ ఉంటుంది. దేవాదాయ శాఖ కూడా ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించింది. అయితే ఇందు కోసం ప్రోటోకాల్ పరిధిలోని వారికి మాత్రమే అవకాశం ఉంటుంది కానీ సినీ రంగానికి చెందిన వారి పట్ల ప్రత్యేక మర్యాదలు పాటించాలన్న నిబంధనలు ఏమీ లేవని తెలుస్తోంది. అయినప్పటికీ కొండగట్టులో మాత్రం ఇద్దరు నటులకు ప్రత్యేకంగా స్వాగతం చెప్పడం విమర్శలకు దారి తీసింది.

You cannot copy content of this page