గోన సంచిలో మహిళ మృతదేహం.. షాక్‌లో పోలీసులు

మహిళలపై ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు అక్రమ సంబంధం నేపథ్యంలో వ్యక్తి నమ్మి మోసపోయి చివరికి శవమై తేలుతుంటే, మరికొందరు వివిధ కారణలతో తమ ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. మహిళ అనుమానస్పద స్తితిలో మరణించిన ఘటన కలకలం సృష్టిస్తోంది.

సంఘటన వివరాల్లోకి వెళ్లితే..ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలోని ఇబ్రహీం కసమ్‌ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌లో 50-55ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ శవాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఉంచినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మహిళకు సంబంధించిన ఎలాంటి విషయాలు తెలియవని, తమకు అందిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా, మహిళ మృతదేహం లభ్యం అయినట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. బాధితురాలి సోదరుడు కాలాచౌకి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో అధికారులు ఇరుగుపొరుగు వారితో మాట్లాడారు. అయితే బాధితురాలు రెండు నెలల నుంచే కనిపించడం లేదని, మహిళ చనిపోయి కుళ్లిపోయిన స్థితిలో ఉన్నా, దుర్వాసన రావడంతో గుర్తించలేకపోయామన్నారు. ఇక మహిళ శవాన్ని చూస్తే రెండు మూడు రోజుల క్రితమే చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, ఇది ఆత్మ హత్యా లేక హత్యా, ఎవరైనా ప్లాన్ ప్రకారం చేశారా అనే కోణంలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. మరో వైపు మృతదేహాన్ని శవ పరిక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

You cannot copy content of this page