వైన్ షాపు ముందు మహిళల బైఠాయింపు… ముదురుతున్న వివాదం

దిశ దశ, కరీంనగర్:

వైన్ షాపు ఎత్తేయండి మహాప్రభో అంటూ నిరవధిక నిరసనలు చేపట్టినా అధికారుల నుండి స్పందన రాకపోవడంతో కాలనీకి చెందిన మహిళలు ఏకంగా సదరు మద్యం దుకాణం ముందే బైఠాయించారు. కరీంనగర్ గాంధీ రోడ్డులోని వైన్ షాపు వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. పలు మార్లు నిరసనలు చేపట్టినా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రజావాణికి సమీపంలోని అశోక్ అనే వ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తిరిగి మంగళవారం నాడు మహిళలు పెద్ద ఎత్తున వైన్ షాపు ముందు బైఠాయించి గాంధీరోడ్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణంలోకి ఎవరూ వెల్లకుండా మహిళలే అడ్డుగా కూర్చొని ఆందోళన చేపట్టారు. ఎక్సైజ్ అధికారులు ఈ వైన్ షాపును వెంటనే గాంధీరోడ్ నుండి తరలించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. నివాస ప్రాంతాలతో పాటు చిరు వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నందన వైన్ షాపు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపారాలపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతోందని కూడా వారు అంటున్నారు. సీపీఏం నగర కార్యదర్శి గుడికందుల సంత్యంతో పాటు ఐద్వా మహిళా నాయకులు కూడా ఈ ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకుని గాంధీ రోడ్ లోని వైన్ షాపు లైసెన్స్ ను రద్దు చేయాలని గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. 

You cannot copy content of this page