ఆక్రమించుకునేందుకు వచ్చిన మహిళలు…
రంగంలోకి దిగిన పోలీసులు….
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ లో మళ్లీ డబుల్ బెడ్రూం ఇండ్ల గొడవ షురూ అయింది. ఏండ్లుగా దరఖాస్తు చేసుకుంటున్నా తమకు మాత్రం ఇండ్లు కెటాయించడం లేదంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ ఒకటవ డివిజన్ లో నిర్మాణం పూర్తయిన డబుల్ ఇండ్ల వద్దకు చేరుకున్న మహిళలు తమకు న్యాయం చేసే వరకూ ఇక్కడి నుండి కదలిలేది లేదని భీష్మించుక కూర్చున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నుండి కేసీఆర్ ఇండ్ల వరకు ప్రతిసారి తాము దరఖస్తులు చేసుకుంటున్నామని అయినప్పటికి తమకు మాత్రం ఇండ్లు కెటాయించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతూ తమకు ఇండ్లు కెటాయించాలని అభ్యర్థిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని వారన్నారు. తెల్లవారు జామునే డబుల్ ఇండ్ల వద్దకు చేరుకున్న మహిళలు పురుగుల మందు డబ్బాలు, కత్తుల తీసుకుని వచ్చి తమను ఇక్కడి నుండి తరలిస్తే ఊరుకోమని, ఇక్కడే నివాసం ఉంటామని హెచ్చరించారు. 18 ఏళ్లుగా దరఖాస్తులు చేసుకోవడానికి సరిపోతున్నాం కాని తమకు ఇళ్లును మాత్రం మంజూరు చేసేవారు లేరంటున్నారు. కూలీ నాలి చేసుకుని జీవనం సాగిస్తున్న తమను ప్రతి ఒక్కరూ విస్మరిస్తున్నారని, ఇప్పుడు నిర్మాణం పూర్తయిన ఇండ్లలో అలాట్ చేసేది లేదని తేల్చి చెప్తున్నారన్నారు. దీంతో ఎవరికి కెటాయించని డబుల్ ఇండ్లలో నివాసం ఉండేందుకు వచ్చామని చెప్పారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళల నుండి వివరాలు సేకరించడంతో పాటు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే వారు మాత్రం ససేమిరా అనడంతో పోలీసులు బలవంతంగా స్టేషన్ కు తరలించారు.
Disha Dasha
1884 posts
Prev Post