ప్రస్తుతం టాలెంట్ ఉన్న వారికి మాత్రమే మంచి అవకాశాలు వస్తున్నాయి. కంపెనీలు కూడా అటువంటి వారికే ఓటు వేస్తున్నాయి. కెరీర్ గాడిలో పెట్టాలంటే దానికి తగ్గ నైపుణ్యాలు కూడా ఉండాలి. అలాగే వాటికి అవసరమైన స్కిల్స్ డెవలప్ కూడా చేసుకోవడం చాలా ముఖ్యం. ఆసక్తి ఉన్న వారికి ఇంటర్న్‌షిప్‌లు బాగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం డేటా అనలిస్ట్ విభాగంలో కొన్ని కంపెనీలు అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కలిపిస్తున్నాయి. ఈ వర్క్ మీరు ఇంటి దగ్గర నుంచి కూడా చేసుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యూచర్ సిల్క్ ( Future Silk ) కంపెనీ 6 నెలల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన వారికి అభ్యర్థులకు ప్రతి నెల రూ.4000 స్టైఫండ్ చెల్లిస్తారు. దీనికి కావలిసిన అర్హతలు ఏంటంటే MS Excelతో పాటు డేటా అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 29 లోపు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
కార్తీక్ ధోతీ సంస్థ Data Analyst ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నారు. ఒక పోస్టుకు మాత్రమే అవకాశం ఉంది. 3 నెలలపాటు ఈ ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సెలెక్ట్ ఐనా అభ్యర్థులు ప్రభావితం చేస్తే స్థానిక, జాతీయ, ట్రెండ్‌లను పరిశీలించాలిసి ఉంటుంది. ఎంపిక అయిన వారి ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్ ప్రతి నెల రూ.3000 స్టైపెండ్ చెల్లిస్తారు. ఆసక్తి కల అభ్యర్థులు 2023 జనవరి 20 లోపు ఈ ఇంటర్న్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు.