భారతీయ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో ‘టాటా నెక్సాన్’ తో పోటీపడే ఈ కారు కూడా లేదు. మహీంద్రా XUV400 లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారుకు ఉన్న డిమాండ్ మొత్తం మారిపోయింది. మహీంద్రా XUV400 కారు మాత్రం టాటా Nexon EV పోటీపడుతుంది. XUV400 వచ్చిన తర్వాత నుంచి టాటా కంపెనీ నెక్సాన్ కార్ ధరను తగ్గించేసింది. దీని కోసం టాటా కంపెనీ కొత్త నెక్సాన్ మోడల్ వేరియంట్‌ను కూడా మన ముందుకు తీసుకొచ్చింది. ఈ కార్ బేస్ వేరియంట్ .. ధర రూ.14.49 లక్షలుగా ఉంది.
టాటా నెక్సాన్ EV రెండు వెర్షన్లలో మనకి అందుబాటులో ఉండనుంది. అవి Nexon EV ప్రైమ్ మరియు Nexon EV మాక్స్. Nexon EV ప్రైమ్ కార్ ప్రారంభ ధర రూ. 14.49 లక్షలుగా ఉంది. Nexon EV Max ధర రూ. 16.49 లక్షలుగా ఉంది. ప్రైమ్ టాప్ వేరియంట్ రూ. 17.19 లక్షలు, మ్యాక్స్ టాప్ వేరియంట్ ధర రూ. 18.99 లక్షలుగా ఉంది.
మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV కారు ధర రూ. 15.99 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్ టాప్ ఎండ్ కార్ వేరియంట్ ధర రూ. 18.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. Nexon మరియు XUV400 రెండు వేరియంట్ కార్ల ధరలు సమానంగా ఉన్నాయి . అందుకే ఈ కార్లకు మధ్య పోటీ బాగా పెరిగింది.