నిన్న అలా… నేడు ఇలా…

ఆమెలో ఈ మార్పేంటో…?

క్యాడర్ కు దూరంగా… లిమిటెడ్ సర్కిల్ కే పరిమితం అయ్యారామె. జనం ప్రభంజనం అన్న రీతిలో వ్యవహరించిన ఆమె ఆ టూర్ తర్వాత ఇలా మారిపోయారేంటి…? కొత్త పంథా ఎంచుకున్నారా లేక ఎత్తుగడలో భాగమా అన్న చర్చే సాగుతోంది రాష్ట్రం అంతా.

కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనాలు అందుకుంటూ…

నిన్న ఇలా…

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహం వెనక ఉన్న మర్మమేమిటో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రం అంతటా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవల్సినప్పటికీ చాలా తక్కువ మందే ఆమె బర్త్ డే నిర్వహించారు. భారత జాగృతి శ్రేణులు కూడా భారీ ఎత్తున సంబరాలు చేపట్టలేదనే చెప్పాలి. హంగామా చేయకుండా ఎమ్మెల్సీ కవిత కూడా కేవలం తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు కూడా చాలా వరకు కవిత జన్మదినోత్సవాలు జరపకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు అన్ని స్థాయిల్లోని క్యాడర్ ఫ్లెక్సీలు కట్టడం కేకులు కట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అప్పుడు చేసిన బర్త్ డే సెలబ్రేషన్స్ కు ఈ సారి జరిగిన జన్మదినోత్సవాలకు పోలికే లేకుండా పోయిందని అంటున్న వారూ లేక పోలేదు.

కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు వేడుకల్లో

నేడు ఇలా…

తన పుట్టినరోజు మరునాడు వేకువ జామునే జగిత్యాల జిల్లా కొండగట్టుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించిన కవిత కేవలం తన కుటుంబ సభ్యులను మాత్రమే దర్శనానికి తీసుకెళ్లారు. పార్టీ క్యాడర్ కు కానీ, భారత జాగృతి శ్రేణులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కవిత కొండగట్టు పర్యటన చేయడం గమనార్హం. ఆమె ఎక్కడ టూర్ చేసినా సంబందిత ఎమ్మెల్యేలకు, పార్టీ శ్రేణులకు కూడా సమాచారం ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఈ సారి మాత్రం ఆమె ఎవరికీ సమాచారం ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మరో వైపున కొండగట్టు అంజన్న దర్శనం పూర్తయిన తరువాత నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం చౌడమ్మ కొండూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ మాత్రం అన్నదానం కార్యక్రమం నిర్వహించగా ఇక్కడ మాత్రం జడ్పీ ఛైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, మేయర్ నీతు కిరణ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులలను భాగస్వాములను చేయడం విశేషం.

చౌడమ్మకొండూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న కవిత కుటుంబ సభ్యులు

ఎందుకిలా…?

ఎమ్మెల్సీ కవితలో అనూహ్యంగా వచ్చిన ఈ మార్పునకు కారణం ఏంటన్నదే అంతు చిక్కడం లేదు. ఈనెల11న ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరై వచ్చిన ఆమెలో ఆత్మస్థైర్యం నింపేందుకు పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో కృషి చేశాయి. సోషల్ మీడియా వేదికగా బీజేపీని కార్నర్ చేస్తూ కవితను హైలెట్ చేస్తూ ట్రోల్స్ చేశాయి. కానీ కవిత బర్త్ డే సెలబ్రేషన్స్ మాత్రం నామమాత్రంగా చేయడం, కొండగట్టు టూర్ గురించి ఎవరికీ చెప్పకపోవడం. చౌడప్పకొండూరు ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు మాత్రం అక్కడి నాయకులను ఆహ్వానించడం వెనుక ఆంతర్యం ఏంటోనన్నదే చర్చకు దారి తీస్తోంది.

కొండగట్టులో పూజల అనంతరం అంజన్న ఆలయం మందు కవిత

You cannot copy content of this page