దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల జిల్లాలో పోటాపోటి రాజకీయాలు సాగుతున్నాయి. 24 గంటలు తిరగకముందే రివైంజ్ పాలిటిక్స్ చేపడుతూ సరికొత్త చర్చకు దారి తీస్తున్నారు ఇక్కడి నాయకులు. గతంలో ఎమ్మెల్సీ కవితకు టూర్ కు ముందు పసుపు బోర్డు ఏమైందంటూ వ్యంగోక్తులతో కూడిన ఫెక్సీలను ఏర్పాటు చేయగా మరు నాడే తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఫెక్సీలను ఏర్పాటు చేశారు. తాజాగా సోమవారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం కొండికర్ల వంతెన కట్టిస్తానని మాట ఇచ్చి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ ఆయన రాసిచ్చిన నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ను ఫ్లెక్సీ చేయించి పిండ ప్రధానం చేశారు. తాజాగా మంగళవారం నాడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తీసుకొస్తానని మాట ఇచ్చి తప్పారంటూ ఆయన దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. అనంతరం అరవింద్ రాసిచ్చిన నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ఫ్లెక్సీ ముందు పిండ ప్రధానం నిర్వహించారు. పసుపు బోర్డు తీసుకొస్తానని మాట ఇచ్చిన అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
జెండాలు పక్కన పెట్టి…
అయితే ఆయా పార్టీల నాయకులు పార్టీ జెండాలు ఈ వినూత్న నిరసన కార్యక్రమాల్లో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణ ప్రజలే తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్న భావన కల్పించేందుకు తమతమ పార్టీల జెండాలు, కండువాలు లేకుండా ఆందోళనలు చేపడుతుండడం విశేషం.
Disha Dasha
1884 posts
Next Post