పుస్తకాలు పక్కన పెట్టి… గొడుగులు చేతబట్టి…

మంచిర్యాల జిల్లా విద్యార్థుల ఇబ్బందులు

దిశ దశ, మంచిర్యాల:

చదువుకునేందుకు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు పుస్తకాలు పట్టుకుని వెల్తుండడం సహజం. బడిలో సార్లు చెప్పే పాఠాలు వింటూ నోట్స్ రాసుకోవడమూ కామన్. కానీ ఆ పాఠశాలకు వెల్లే విద్యార్థులు తమ వెంట బుక్స్ తీసుకెళ్లకున్నా ఫర్లేదు కానీ… గొడుకు మాత్రం కంపల్సరీగా తీసుకెళ్లాల్సిందే. వర్షాకాలంలో గొడుకు లేకుండా బడికి వెళ్లే పరిస్థితి లేకుండా పోవడంతో అటు సార్లు… ఇటు విద్యార్థులు పుస్తకాలను పక్కన పడేసి వెల్లాల్సి వస్తోంది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కష్ణపల్లి జడ్పీ హై స్కూల్ లో ఎనిమిదో తరగతి విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. క్లాస్ రూం స్లాబ్ డ్యామేజీ కావడంతో వర్షం పడినప్పుడల్లా విద్యార్థులు తడిచిముద్దవుతున్నారు. తరగతి గది పైకప్పు నుండి వర్షపు నీరు నేరుగా క్లాస్ రూంలోకి వచ్చిపడుతుండడంతో విద్యార్థులు తడవకుండా ఉండేందుకు ప్రత్యేకంగా గొడుగులు ఏర్పాటు చేసుకోవల్సిన పరిస్థితి తయారైంది. పాఠశాలలో ఉన్న మూడు గదుల్లో ఒక రూం పై కప్పు లీకేజీల వల్ల ఈ సమస్య ఎదురవుతోంది. దీంతో టీచర్లు చెప్తున్న పాఠాలు వినేందుకు విద్యార్థులు గొడుగులు పట్టుకునే క్లాసు రూంలో కూర్చుంటున్నారు. విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకుని పాఠశాల భవనం కోసం నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

You cannot copy content of this page