వితౌట్ హెల్మెట్ నో డ్యూటీ…

దిశ దశ, జగిత్యాల:

హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే పోలీసుల కెమెరాలకు చిక్కి ఫైన్లు కట్టాల్సి వస్తుందన్న భయం వెంటాడుతుంది చాలా మందిని. అందుకే ప్రతి బైక్ వాలా కూడా హెల్మెట్ లేకుండా బయటకు తిరగడానికి సాహసించరు. కానీ అక్కడ మాత్ర భవనంలో ఉన్నా హెల్మెట్ పెట్టుకునే ఉంటారు సర్కారు ఉద్యోగులు. లేనట్టయితే తమ ప్రాణాలకు గ్యారెంటీ ఉండదన్న భయం వారిని వెంటాడుతోంది. బైక్ పై వెల్లినప్పుడు యాక్సిడెంట్ అయితే హెల్మెట్ సేఫ్టీగా ఉంటుందని విన్నాం కానీ… భవనంలో ఉన్నప్పుడు వారు హెల్మెడ్ వాడడం విచిత్రంగా ఉంది కదు. మీరీ చిత్ర విచిత్రమైన పరిస్థితిని చూడాలంటే జగిత్యాల జిల్లా బీర్పూర్ ఎంపీడీఓ ఆఫీసుకు వెళ్లాల్సిందే.

భయం భయంగా…

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు జిల్లాలను ఏర్పాటు చేసిన సమయంలో నూతన మండలంగా ఆవిర్భవించింది బీర్పుర్ మండలం. ఓ ప్రైవేటు భవనంలో ఎంపీడీఓ కార్యాలయం ఏర్పాటు చేసిన అధికారులు ముందు ముందు భవనం పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. దీంతో హాడావుడిగా నూతన మండలం ప్రకటన వెలువడిందే తరువాయి చకాచకా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఏర్పాటయిన మండల పరిషత్ అభివృద్ది అధికారి కార్యాలయ భవనం ఉద్యోగులను భయం గుప్పిట విధులు నిర్వర్తించే పరిస్థితికి చేర్చింది. ఈ భవనం శిథిలమై పోతుండడంతో తరుచూ పై కప్పు ఊడి కిందపడిపోతుండడంతో ఆఫీసులో పనిచేస్తున్న యంత్రాంగం అంతా కూడా తామీరోజు ఇంటికి క్షేమంగా చేరితే చాలు దేవుడా అనుంకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.

హెల్మెట్ డ్యూటీ అందుకే…

అయితే ఈ భవనంలో తరుచు పె పెచ్చులు ఊడిపోతుండడంతో ఎప్పుడు తమ తలలు పగిలిపోతాయెనన్న భయం ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందిలో నెలకొంది. దీంతో విధులకు హాజరు కాకుంటే ఇబ్బంది తప్పదని భావించిన ఉద్యోగులు రెండు రోజలుగా తమ తలలకు హెల్మెట్లు పెట్టుకుని డ్యూటీలు చేస్తున్నారు. గృహలక్ష్మీ పథకంలో భాగంగా దరఖాస్తులు తీసుకునేందుకు ఆరుబయట ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసుకున్నారు. దరఖాస్తు దారులు వచ్చినప్పుడు పై పెచ్చులు ఊడిపడితే లబ్దిదారులకు గాయాలయ్యే ప్రమాదం ఉందని ఆఫీసు ముందు స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఎంపీడీఓ మల్లారెడ్డి తన ఛాంబర్ నుండి బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే పె పెచ్చులు ఊడిపడ్డాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు మల్లారెడ్డి అలా బయటకు వెళ్లారో లేదో పె పెచ్చులు ఊడిపడడంతో ఆయన సేఫ్ అయ్యారు. గతంలో ఈ భవానాన్ని ఖాలీ చేయాలని జిల్లా అధికారులు ఆదేశించినప్పటికీ ఆచరణలో మాత్రం పెట్టలేకపోతున్నారు. దీంతో తరుచూ పై పెచ్చులు ఊడడం తమను తాము రక్షించుకునే పరిస్థితులు లేకపోవడంతో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది హెల్మెట్లతో డ్యూటీ చేస్తుండడం గమనార్హం.

You cannot copy content of this page