బుసలు కొట్టుకుంటూ తిరుగుతున్న నాగు పాము ఒకటి పొదల నడుమ వేసిన వలలో చిక్కుకుంది. వల నుండి బయటకు రావాలని ప్రయత్నించి విఫలం అయిన ఆ విష సర్పాన్ని కాపాడింది ఆ గ్రామ యువత. చిన్న చిన్న జంతువులు చేనులోకి చొరబడకుండా ఉండేందుకు ఓ రైతు వలను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ వల వైపునకు వెల్లిన నాగు పాము ఒకటి అందులో చిక్కుకపోయింది. దాదాపు ఐదు రోజుల క్రితం పాము వలలో చిక్కున్నప్పటికీ దానిని కాపాడేందుకు ఎవరూ సాహసించలేదు. అయితే ఈ విషయం గమనించిన యువకులు విష సర్పాన్ని కాపాడేందుకు సాహసించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన కటుకం రాము అనే యువకుడు వలలో చిక్కకున్న పామును గమనించి తన స్నేహితుడైన సత్యంతో పాటు మరికొంతమందికి వివరించాడు. వలలో చిక్కుకున్న పాము బయట పడేందుకు ప్రయత్నించి విఫలం అవుతుందని గమనించారు. వెంటనే పామును అల్లుకున్న వలను మొత్తం కట్ చేసి నీటిలోకి వదలడంతో స్వేచ్ఛగా వెల్లిపోయింది. ఐదు రోజులుగా వలలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితికి చేరుకున్న పామును కాపాడిన తీరు తెలుసుకున్న ప్రతి ఒక్కరు రాము స్నేహితుల బృందాన్ని అభినందించారు. దానిని అలాగే వదిలేస్తే ఆహారం అందక చనిపోయేదని, విషపూరితమైన ప్రాణే అయినప్పటికీ ప్రాణం పోవడం సరికాదన్న ఉద్దేశ్యంతోనే వలను కట్ చేసి కాపాడామన్నారు కటుకం రాము.
