శంకర్ నాయక్ భార్య నిరసన
మహబూబాబాాద్ జిల్లా మాన్ సింగ్ తండా ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైస్ షర్మిల నైట్ క్యాంప్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన డాక్టర్ సతీమణి సీతామహాలక్ష్మి కూడా ఆందోళన చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్థుల కేసు కావాలని పెడితే మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు అన్యాయంగా పెట్టిన కేసు అని క్లోజ్ చేయించారని వెల్లడించారు. 18 నెలలు జైలు జీవితం తాము గడపలేదని అవినీతి అక్రమాలకు పాల్పడలేదంటూ సీతామహాలక్ష్మీ దుయ్యబట్టారు. ఆడపిల్లలా మాట్లాడలని, అందరికి మాట్లాడే హక్కు ఉందని, అయితే భావ వ్యక్తీ కరణకు ఓ పద్దతి ఉంటుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని సీతామహాలక్ష్మీ హితవు పలికారు. రాజకీయాల కోసం సొంత వారిని చంపుకున్న నేర చరిత్ర లేదు… తల్లి… రక్త చరిత్ర కూడా లేదు తల్లి అంటూ వ్యాఖ్యానించారు. మీ నాన్న వయసులో ఉన్న కేసీఆర్ ను దయ్యబట్టడం ఎంద వరకు సమజంసం, మారుమూల మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
క్యాంప్ వద్ద ఉద్రికత్త…
జిల్లాలోని మాన్ సింగ్ తండా వద్దకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు గులాభి శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. క్యాంప్ వద్దకు చేరుకున్న వేలాది మంది షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు లోపలకు చొచ్చుకపోయే ప్రయత్నం చేశారు. వీరందరిని పోలీసులు కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
షర్మిల అరెస్ట్…
మహాబుబాబాద్ జిల్లాలోని మాన్ సింగ్ తండా వద్ద వైఎస్సార్టీపీ అధినేత్రికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఆమెను పోలీసు వాహనంలో స్టేషన్ కు తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, శంకర్ నాయక్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా బీఆర్ఎస్ మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారని, దీంతో శాంతిభద్రతలకు విఘాతం కల్గిందని పోలీసులు అంటున్నారు.