మూడో సారి ఎమ్మెల్సీ కవిత విచారణపై మరింత ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. నేడు మూడోసారి ఈడి ఎదుట కవిత హాజరుకానున్న నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఏం చేయబోతోంది అన్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఢిల్లీ
లిక్కర్ స్కాం లో అనుమానితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇప్పటికే 20 గంటల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఈడీ కార్యాలయానికి వెళ్లేముందు ఉదయం 11గంటలకు మీడియాతో కవిత మాట్లాడనున్నారు. ఈ రోజు కవిత సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశాలు లేకపోలేదు. ఈడీ లక్ష్యంగా కవిత విమర్శలు సంధించే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ఈడీ విచారించిన తీరుపై ఆరోపణలు చేస్తారా తనను కావాలనే ఈ కేసులో ఇరికించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండి పడ్తారా అన్న చర్చ సాగుతోంది. అయితే ఈరోజు కవిత మీడియా ముందు చేసే వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసే అవకాశాలు ఉండే అవకాశం లేక పోలేదు. మరోవైపు కేసు దర్యాప్తునకు కవిత సహకరించడం లేదంటున్న ఈడి వర్గాలు చెప్తుండడం గమనార్హం. సౌత్ గ్రూప్ నిందితులతో ఉన్న సంబంధాలు,100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, విజయ్ నాయర్ -సమీర్ మహేంద్రుతో సమావేశాలు, మనీష్ సిసోడియాతో రాజకీయ అవగాహనపై కవిత నుండి ఎలాంటి స్పందన రాలేదని అంటుండడం గమనార్హం. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడంతోనే మరోసారి ఈడి సమన్లు జారీ చేసినట్లు సమాచారం. నేటి ఈడి విచారణతో కవిత అరెస్ట్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది
Disha Dasha
1884 posts
Prev Post
Next Post