కాలగర్భంలో కలిసినా… చరిత్ర మాత్రం పదిలం

అక్టోబర్ 25 పీపుల్స్ వార్ అత్యంత అరుదైన చరిత్రను లిఖించుకున్న రోజు. ఆసియాలోనే అతి పెద్ద స్థూపాన్ని నిర్మించి అమరవీరులకు జోహార్లు అర్పించిన రోజు. చైనాలోని తియన్మాన్‌స్కైర్‌ హుస్నాబాద్‌లో పీపుల్స్‌వార్‌ 1990 అక్టోబర్ 25న స్థూపం నిర్మించింది. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద అమరవీరుల స్మారక స్థూపాన్ని
88 అడుగుల ఎత్తులో నిర్మించి భారత విప్లవ పంథాలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అయితే
10 ఏళ్లలోనే ఈ స్తూపం నేల మట్టమయిపోయి ఉద్యమ చరిత్ర ఆనవాళ్లను అంతమొందించిందనుకున్నా చరిత్ర మాత్రం పదిలింగానే మిగిలిపోయింది. 1972–89 మధ్యన ఎదురుకాల్పుల్లో అమరులైన 88మంది పీపుల్స్‌వార్‌ నక్సల్స్ స్మారకార్థం హుస్నాబాద్‌ అక్కన్నపేట రోడ్డులో 88 అడుగుల ఎత్తుతో స్థూపాన్ని నిర్మించారు. అప్పటి పీపుల్స్‌వార్‌ జిల్లా కార్యదర్శి సందేవేని రాజమౌళి అలియాస్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ స్తూపాన్ని నిర్మించారు. రూ.12లక్షలతో రాజస్థాన్‌ నుంచి నల్ల గ్రానైట్‌ రాయిని తెప్పించి నిర్మాణం చేశారు. 110 కిలోల బరువు కలిగిన భారీ ఆకారంలో సుత్తి కొడవలి చేయించి స్థూపం పైన ఏర్పాటు చేయించారు. 1989 ఎన్నికల సమయంలో పీపుల్స్ వార్ కు స్వేచ్ఛనిస్తామని అప్పటి కాంగ్రెస్ పార్టీ నేత మర్రి చెన్నరెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రిగా పీపుల్స్ వార్ నక్సల్స్ కు స్వేచ్ఛ కల్పించారు. ఈ సమయంలోనే పార్టీ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని భావించి స్మారక స్థూపాలను నిర్మించాలని పీపుల్స్ వార్ నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే హుస్నాబాద్ స్థూపం ఆవిష్కణకు నోచకుంది. విప్లవోద్యమం బాటలో నడిచి అసువులు బాసిన అమరుల సృతిగా నిర్మించిన ఈ స్థూపం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు తెర లేపింది. నిర్మాణం జరుపుతుండగా హుస్నాబాద్‌ సమీపంలోని పందిల్లకు చెందిన బొమ్మగాని నారాయణ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

విధ్వంసం అయిన స్థూపం

అధికారుల కిడ్నాప్‌

ఆ తరువాత నెలకొన్న పరిస్థితుల కారణంగా అడగడుగునా స్థూప నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికి ఎట్టకేలకు లక్ష్యాన్ని మాత్రం అందుకున్నారు. అయితే దీని ఆవిష్కరణకు కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వయోజన విద్య ప్రాజెక్టు అధికారి శేషుకుమార్‌, ఏఈ బాల్‌ లింగారెడ్డి, ఎంఆర్‌వో రాజమౌళిని కిడ్నాప్‌ కు పాల్పడి తమ డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచింది. హుస్నాబాద్ స్థూపాన్ని ప్రారంభించేందుకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని డిమాండ్ చేయడంతో 25 అక్టోబరు 1990లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రజా యుద్ద నౌక గద్దర్‌, విప్లవ రచయితల సంఘం నాయకులు వరవరరావు, బాలగోపాల్‌, శ్రీమన్నారాయణ హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్‌) నాయకుడు యాసీన్‌మాలిక్‌ సందర్శించారంటే హుస్నాబాద్ స్థూపం ఏ స్థాయిలో ప్రాచూర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఈ స్థూపావిష్కరణ తరువాత పీపుల్స్‌వార్‌కు మద్దతు ఇస్తున్నారన్న కారణంతో 180మందిపై కేసులు నమోదు చేయగా సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టి వేశారు.

స్థూపంనూ ఏర్పాటు చేసిన సుత్తి… కొడవలి

దశాబ్దానికి….
రాష్ట్రంలో పీపుల్స్ వార్ ఎలాంటి చర్యలకు పాల్పడినప్పుడల్లా… హుస్నాబాద్ స్థూపంపై ప్రతీకారం తీర్చుకునే వారు. గుర్తు తెలియని వ్యక్తులు మూడు సార్లు ఈ స్థూపంపై దాడి చేయడంతో పాక్షికంగా దెబ్బతిన్నది.
2000 సంవత్సరంలో హుస్నాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాంతరావు ఇంటిని పేల్చివేయడంతో గ్రీన్‌టైగర్స్‌ పేరుతో స్థూపాన్ని డిటోనేటర్లు పెట్టి పూర్తిగా ధ్వంసం చేయడంతో పూర్తిగా నేలమట్టమైంది.

You cannot copy content of this page