గజ్వేల్ ఎలా ఎంది… మేమెలా ఉన్నాం

సీఎంను నిలదీయండి
మునుగోడు ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేలో లో రోడ్లెలా ఉన్నాయి? ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడులో రోడ్లు ఎలా ఉన్నాయని సీఎం ను నిలదీయాలని బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గం మర్రిగూడెం మండలం సరంపేట ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… త్వరలో మీ పక్క ఊరికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారని గజ్వేల్ లో అద్దంలా రోడ్లు మెరుస్తుంటే మునుగోడులో ఎందుకు ఆ పరిస్థితి లేదని ప్రశ్నించాలన్నారు. మునుగోడు తెలంగాణాలో ఉన్నట్టా లేనట్టని భావిస్తున్నారా అని అడగడంతో పాటు గజ్వేల్ లాంటి అభివృద్ది ఇక్కడ కూడా చేపట్టాలని రాజగోపాల్ రెడ్డి అడిగింది వాస్తవమా కాదా అంటూ సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించాలని ఈటల కోరారు. కడుపు నొప్పి వస్తే తగ్గేందుకు గ్రామాల్లో అవసరమైప మందులు దొరకవు కానీ గల్లీ గల్లీలో బెల్ట్ షాపుల ద్వారా మాత్రం మద్యం అందుబాటులో ఉంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.
మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే కెసిఆర్ దోపిడీ పాలన అంతం అవుతుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. శివన్న గూడెం ప్రాజెక్ట్ లో మునిగిన ఐదు గ్రామాల ప్రజల కంట్లో సీఎం కేసీఆర్ మట్టి కొట్టారని ఈటల రాజేందర్ ఆరోపించారు.
నష్టపోయిన రైతులకు, గ్రామస్థులకు మర్యాదగా డబ్బులు ఇవ్వలాని లేనట్టయితే మీ భరతం పడతామని ఈటల రాజేందర్ హెచ్చరించారు. బీజేపీ వస్తే అధికారంలోకి రాగానే ఏటా ఉద్యోగ కాలెండర్ ఇస్తామని,
మన పిల్లలకు ఇంగ్లీష్ మీడియం నాణ్యమైన విద్య ఆందిచడమే కాకుండా, మంచి భోజనం పెడతామని ప్రకటించారు. కౌలు రైతులకు రైతు బంధు అమలు చేస్తామని, మొదటి తారికునే పెన్షన్ వేస్తామని, ఎవరి జాగాలో వారు ఇల్లు కట్టుకొనే అవకాశం ఇస్తామని ఈటల రాజేందర్ వెల్లడించారు

You cannot copy content of this page