గీత దాటితే వేటే..

సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిభందనలు అమలు చేసేందుకు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. సిగ్నల్స్, జీబ్రా లైన్స్ అన్ని ఏర్పాటు చేసినా వాహనదారులు మాత్రం ఇష్టారీతిన నడుపుతున్నారు. దీనివల్ల అటు పాదాచారులకు, ఇటు ఇతర వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిభందనలు పాటించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. సిగ్నల్స్ వద్ద గీత దాటిన వారిని గుర్తించి ఫైన్లు వేయాలని, ఇందుకు ట్రాఫిక్ యంత్రాంగం సమాయత్తం కావాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఇక నుండి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సిగ్నల్స్ దాటిన వాహనదారులను గుర్తించి జరిమానాలు విధించనున్నారు. ఇందులో భాగంగా స్టాఫ్ లైన్ ఉల్లంఘనపై స్పెషల్ డ్రైవ్ చేయనున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మోటారు వాహన చట్టం 177 ప్రకారం స్టాఫ్ లైన్, జీబ్రా లైన్స్ దాటిన వారిపై జరిమానాలు విధించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న క్రమంలో భాగ్యనగర్ వాహనదారులు అప్రమత్తంగా ఉండకపోతే మీ జేబు గుల్ల కావడం ఖాయం.

You cannot copy content of this page