ముందస్తు అనుమతి ఉంటే మూన్ లైటింగ్ ఓకె

టెక్ మహీంద్రాలో బంపర్ ఆఫర్

ఐదో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా తమ ఉద్యోగులకు కల్నిస్తున్న వెసులుబాటును వెల్లడించింది. మూన్‌లైటింగ్‌ విధానంలో అనుమతిస్తు పనిచేస్తున్నట్టు తెలిపింది. డిజిటల్ కంపెనీగా వ్యవహరిస్తున్న తమ సంస్థ మూన్‌లైటింగ్‌కు మద్దతిస్తున్నామని సంస్థ సీఈఓ, ఎండీ సీ పీ గుర్నానీ తెలిపారు. అయితే ఈ విషయం కొన్ని పద్దతులను అనుసరిస్తామని ఆయన స్పష్టం చేశారు. 90 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని, ఆయా దేశాల్లో ఉన్న కార్మిక చట్టాలకు కట్టుబడి ఉంటూ సంస్థ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుందన్నారు. ఉత్పాదకత కలిగి ఉండి, సంస్థ మార్గదర్శకత్వంలో విలువలు, కస్టమర్ రిలేషన్‌షిప్ గైడెన్స్ పాటిస్తూ, మరో ఉద్యోగం చేయాలనుకునే వారికి అనుమతి ఉంటుందని వివరించారు. ముఖ్యంగా ఉద్యోగులు రెండో చోట కూడా పని చేస్తున్న సమాచారం తమకు ఇవ్వాలని గుర్నానీ చెప్పారు. ఈ విధానం వల్ల ఉద్యోగుల ప్రవర్తనలో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు విలువలను పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ముందస్తు అనుమతి లేకుండా మూన్‌లైటింగ్‌కు పాల్పడితే మాత్రం సంస్థ పరంగా చర్యలు తీసుకుంటామని ఖరాకండిగా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో టెక్ మహీంద్రా అట్రిషన్ రేటును 22 శాతం నుంచి 20 శాతానికి తగ్గిందని, రెండో త్రైమాసికంలో కొత్తగా 5,877 మందిని చేర్చుకోవడం ద్వారా కంపెనీలో మొత్తం ఉద్యోగులు 1,63,912కు చేరుకున్నారని గుర్నాని తెలిపారు.

You cannot copy content of this page