ముగిసిన ఓ ఘట్టం.

మునుగోడు స్పెషల్ కరస్పాండెంట్:

మునుగోడు ఉప ఎన్నికల్లో కీలకమైన ఓ ఘట్టం శుక్రవారంతో ముగిసింది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ఈ ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు చేసే పర్వం శుక్రవారంతో ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయగా ఈ ఒక్క రోజునే మొత్తం వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలుస్తుండగా, కాంగ్రెస్ పార్టీ తరుపున పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుండి అందోజు శంకరాచారీ, టీజేఎస్ నుండి పల్లె వినయ్ కుమార్ గౌడ్ లు ప్రజా క్షేత్రంలో తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. గురువారం వరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజున ఎన్ని నామినేషన్లు వచ్చాయన్న వివరాలు ఎన్నికల అధికారులు సాయంత్రం వరకూ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణ కోసం ఎన్నికల కమిషన్ గడువు విధించింది. అయితే ప్రభుత్వంపై ప్రత్యక్ష్య పోరాటినిక నడుం బిగించిన వీఆర్ఏలు పోటీ నుండి తప్పుకుంటున్నట్టు ఇప్పటికే ప్రకటించగా వారు నామినేషన్లు ఉపసంహరించుకోనున్నారు. ఇకపోతే రెబెల్ అభ్యర్థులు కానీ ఎన్నికల్లో ప్రభావితం చేయగలిగే నాయకులను పోటీ నుండి తప్పించేందుకు ఆయా పార్టీల నాయకులు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. తమ పార్టీకి అనుకులంగా మల్చుకుని నామినేషన్లను ఉప సంహరించుకునేలా ఒప్పిస్తే బావుంటందని ప్రధాన పార్టీలు యోచిస్తున్నాయి.

You cannot copy content of this page